Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

Keerthi not acting in Hindi film
  • హిందీ సినిమా చేయడం లేదంటున్న కీర్తి 
  • 'ఆచార్య' రిలీజ్ ఇక వేసవిలో కూడా లేనట్టే!
  • గౌతమ్ మీనన్ తో సూర్య మరో సినిమా
*  తాను మైదాన్ అనే హిందీ సినిమాలో నటిస్తున్నానంటూ వస్తున్న వార్తలను కథానాయిక కీర్తి సురేశ్ ఖండించింది. 'మైదాన్ చిత్రంలో నేను నటించడం లేదు. అది వాస్తవం కాదు. సర్కారు వారి పాట షూటింగులో జనవరిలో జాయిన్ అవుతాను. రజనీతో 'అన్నాత్తే' లోను, మలయాళంలో మోహన్ లాల్ సినిమాలోను నటిస్తున్నాను' అని చెప్పింది కీర్తి.
*  మెగాస్టార్ చిరంజీవి కరోనాతో బాధపడుతుండడంతో చిత్ర నిర్మాణం మరింత ఆలస్యం అయ్యేలా వుంది. ఇప్పట్లో ఆయన షూటింగులో పాల్గొనలేరు. దాంతో నిర్మాతలు ప్రకటించినట్టుగా చిత్రాన్ని వచ్చే వేసవిలో విడుదల చేయడం కష్టమని అంటున్నారు.
*  తమిళ చిత్ర కథానాయకుడు సూర్య, దర్శకుడు గౌతమ్ మీనన్ ల కలయికలో మరో సినిమా రానుంది. దీపావళి తర్వాత ఇది ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. గతంలో వీరి కలయికలో 'కాక్క కాక్క', 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' వంటి హిట్ చిత్రాలు వచ్చాయి.
Keerthi Suresh
Chiranjeevi
Surya
Goutham Menon

More Telugu News